Updated : 27/02/2021 08:14 IST

వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోషిప్

దిల్లీ: ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావును కేంద్ర సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోషిప్ వరించింది. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. పరిశోధకుడు, అనువాదకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేల్చేరు.. ప్రసిద్ధ తెలుగు కావ్యాలను ఆంగ్లంలోకి అనువదించారు. శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామంతో పాటు కళాపూర్ణోదయం, కాళిదాసు, విక్రమోర్వశీయాన్ని అనువదించారు. అన్నమయ్య, క్షేత్రయ్య సాహిత్యాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. అమెరికాలో సుదీర్ఘకాలం తెలుగు ఆచార్యుడిగా పనిచేసిన వేల్చేరు.. ఏలూరు సమీపంలోని కొప్పాకలో జన్మించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని