KTR: ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలకు రెండో అతిపెద్ద కేంద్రం హైదరాబాదే: కేటీఆర్
హైదరాబాద్: ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలు తమ రెండవ అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫైనాన్స్ కంపెనీలు తమ సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయన్నారు. నివాసానికి అత్యంత అనువైన ప్రాంతంగా హైదరాబాద్ నిలుస్తోందన్నారు. హెచ్‌ఐసీసీలో నాస్కామ్ 12వ ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. 3 రోజులుగా ఈ కాంక్లేవ్ జరుగుతోంది. ఇందులో వివిధ నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఐటీ గ్రోత్ గణనీయంగా పెరుగుతోందన్నారు.
ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య, చెన్నైలో తేమ ఎక్కువ, ముంబయి ఖర్చుతో కూడుకున్న నగరం... అలాగే అక్కడ రాజకీయ అనిశ్చితి ఉంటుందన్నారు. కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అద్భుతమైన కేంద్రంగా మారిందన్నారు. అత్యున్నతమైన బిజినెస్ స్కూల్స్ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. పరిశ్రమలకు అనువైన పాలసీలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడించారు. టీహబ్, వీహబ్ ద్వారా స్టార్టప్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. టాస్క్ ద్వారా డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు స్కిల్స్ ఇప్రూవ్ చేస్తున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు వస్తున్నాయని వివరించారు. ఎన్నికల టైమ్‌లో కేవలం 6 నెలలు మాత్రమే రాజకీయాలపై దృష్టి పెట్టి.. మిగతా నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధి, ఆర్టికవృద్ధి, ఉద్యోగకల్పనపై దృష్టి పెడతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ గెలవాలని.. ప్రవాస భారతీయుల హోమాలు
-
Movies News
Bigg Boss Telugu 6: ‘బిగ్‌బాస్’ మళ్లీ వస్తున్నాడు.. ప్రోమోతో సందడి చేస్తున్నాడు!
-
India News
Assam Rifles: అస్సాం రైఫిల్స్ శిబిరాలపై మిలిటెంట్ల దాడి
-
Sports News
CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరాజ్ చోప్రా
-
World News
Trump: ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ తనిఖీలు
-
India News
India Corona: గణనీయంగా తగ్గిన కొత్త కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!