APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు

ఏపీఎస్‌ ఆర్టీసీ మరో జాతీయ స్థాయి అవార్డు  సాధించింది. డిజిటల్‌ విధానాలను సమర్థంగా అమలు చేస్తోన్నందుకు ఇచ్చే ‘డిజిటల్‌ టెక్నాలజీ సభ’ అవార్డుకు ఆర్టీసీ

Published : 22 Feb 2022 19:37 IST

విజయవాడ: ఏపీఎస్‌ ఆర్టీసీ మరో జాతీయ స్థాయి అవార్డు  సాధించింది. డిజిటల్‌ విధానాలను సమర్థంగా అమలు చేస్తోన్నందుకు ఇచ్చే ‘డిజిటల్‌ టెక్నాలజీ సభ’ అవార్డుకు ఆర్టీసీ వరుసగా నాలుగో సారి ఎంపికైంది. జాతీయ స్థాయిలో పలు ప్రభుత్వ సంస్థలతో పోటీపడి ఈ అవార్డు సాధించింది. యాప్‌ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టికెట్లు జారీ  చేస్తోంది. వీటిలో విశేష ప్రగతి సాధించినందుకు డిజిటల్‌ టెక్నాలజీ సభ అవార్డుకు ఆర్టీసీ ఎంపికైంది. వర్చువల్‌ సెమినార్‌ ద్వారా అవార్డును ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు