TS News: సీఎస్‌, డీజీపీకి జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ(55) పోలీస్‌ కస్టడీలో అనుమానాస్పద మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్‌  స్పందించింది. సీఎస్‌, డీజీపీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, డిప్యూటీ కమిషనర్‌కు కమిషన్‌ నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఏం చర్యలు

Updated : 25 Jun 2021 00:14 IST

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ(55) పోలీస్‌ కస్టడీలో అనుమానాస్పద మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్‌  స్పందించింది. సీఎస్‌, డీజీపీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, డిప్యూటీ కమిషనర్‌కు కమిషన్‌ నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఆదేశించింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ పేర్కొంది. 

దొంగతనం కేసు విచారణలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మను అడ్డగూడూరు పోలీసులు విచారించారు. ఈ క్రమంలో భాగంగా పోలీస్‌ కస్టడీలో ఆమె మృతిచెందింది. దీంతో ఆ ఠాణా పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం ఎస్సై మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్‌, జానయ్యలను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని