ఆర్‌ఎఫ్‌, మైక్రోవేవ్‌ సాంకేతికతపై VIT-APలో జాతీయ స్థాయి వర్క్‌షాప్‌

వీఐటీ -ఏపీ విశ్వవిద్యాలయంలో ఆర్.ఎఫ్, మైక్రోవేవ్ సాంకేతికతపై జాతీయ వర్క్‌షాప్‌ వర్చువల్‌గా జరిగింది. శనివారం (మే 14న) వర్చువల్‌గా ప్రారంభమైన....

Updated : 15 May 2022 05:54 IST

అమరావతి: వీఐటీ -ఏపీ విశ్వవిద్యాలయంలో ఆర్.ఎఫ్, మైక్రోవేవ్ సాంకేతికతపై జాతీయ వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. శనివారం (మే 14న) వర్చువల్‌గా మొదలైన ఈ వర్క్‌షాప్‌ వారం రోజుల పాటు కొనసాగనుందని వర్సిటీ అధికారులు వెల్లడించారు. దీంట్లో ఔత్సాహిక పరిశోధకులు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు.. Ansys, HFSS పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని  మైక్రోవేవ్ రంగంలో తమ పరిశోధన లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడనుంది. ఈ వర్క్‌షాప్‌నకు ప్రొఫెసర్‌ శరత్‌ కుమార్‌ పాత్రా (డైరెక్టర్‌, ఐఐఐటీ వడోదర) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో 5జీ /6జీ సమాచార రంగాల్లో ఆర్‌.ఎఫ్‌/ మైక్రోవేవ్‌ల ప్రాముఖ్యతను వివరించారు. 

అనంతరం వీఐటీ-ఏపీ వర్సిటీ వీసీ ఎస్‌.వి. కోటరెడ్డి మాట్లాడుతూ.. మన దైనందిన జీవితంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రాముఖ్యత, రక్షణ, వాణిజ్య, టెలికమ్యూనికేషన్‌ పరిశ్రమలో ఆర్‌.ఎఫ్‌, మైక్రోవేవ్‌ విభాగాల పాత్రను వివరించారు. ఐఐటీ రూర్కీ, ఎన్‌ఐటీ సిల్చార్‌, మిజోరం విశ్వవిద్యాలయం వంటి కేంద్ర విద్యా సంస్థలతో పాటు ప్రముఖ పరిశ్రమలకు చెందిన వక్తలు ఈ వర్క్‌షాప్‌లో ప్రసంగించనున్నారు. వర్క్‌షాప్‌కు Entuple, Ansys, Anritsu, IEEE MTTS Society, IEEE APS Societyలు సహ స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తున్నాయి.

ఈ వర్క్‌షాప్‌లో 13 రాష్ట్రాల నుంచి 59 మంది పాల్గొనగా.. వీరిలో 36 మంది దేశంలోని పలు ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆల్ ఇండియా రేడియో,  ప్రసిద్ధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి హాజరయ్యారు. మిగతా 23 మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్‌లు. ఈ కార్యక్రమంలో వర్క్‌షాప్‌ సమన్వయకర్తలు డా.జయేంద్ర కుమార్‌, డా. ఖైర్నర్‌ వికాస్‌ విష్ణు, డా. చందు, డా. పెద్ద కృష్ణ, డా. బప్పాదిత్య రాయ్‌, డా. ఎం.జగదీశ్‌ చంద్ర (డీఎన్‌ అకాడెమిక్స్‌), పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని