Published : 10/11/2021 01:26 IST

Viral news: ఇళ్లలోనే పుర్రెలు.. ఏడాదికోసారి పండగ !

బొలివియా: అక్కడ పుర్రెలను భద్రంగా ఇంట్లో దాచుకుంటారు. ఏడాదికోసారి బయటకు తీసి ప్రార్థనలు చేస్తారు. తమకు మంచి జరగాలని వేడుకుంటారు. కపాలం నోట్లో సిగరెట్‌ పెట్టి, వాటి ముందు కొవ్వొత్తి వెలిగించి అభిమానాన్ని చాటుకుంటారు. పుర్రెలను అందంగా అలంకరించి వాటిని ప్రార్థిస్తే అంతా మంచే జరుగుతుందని బొలివియా దేశ ప్రజలు విశ్వసిస్తారు.

మరణించిన తమవారి ఆత్మ పుర్రెలో ఉంటుందని బొలివియా ప్రజలు భావిస్తారు. తమ కష్టాలను కపాలానికి మొరపెట్టుకొని మంచి జరగాలని వేడుకుంటారు. ఏడాదికోసారి పుర్రెలను అందంగా అలంకరించి పండుగ చేసుకుంటారు. బొలీవియా రాజధాని లాపాజ్‌లో స్కల్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. కుంటుంబంలో చనిపోయిన వారి ప్రతిరూపంగా దాచుకున్న కపాలాలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాదీ నవంబరు నెల ఆరంభంలో బొలివియాలో ఐమారా ప్రజలు ‘నతిత’ పేరుతో ఈ వేడుక నిర్వహిస్తారు. కుటుంబంలో చనిపోయిన వారి పుర్రెలను పూలతో అందంగా అలంకరించి ఆరాధిస్తారు. ప్రతీ వ్యక్తికి ఏడు ఆత్మలుంటాయని, అందులో ఒకటి మానవ పుర్రెలో ఉంటుందని భావించి ప్రార్థనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమను ఆ పుర్రెలోని ఆత్మ రక్షిస్తుందని.. మంచి జరిగేలా చూస్తుందని భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా కపాలాలను అందమైన దండలు, టోపీలు, వివిధ ఉపకరణాలతో సుందరంగా అలంకరిస్తారు.

స్కల్‌ ఫెస్టివల్‌లో భాగంగా పుర్రెలను తమ కుటుంబాలు భద్రంగా దాచుకుంటాయి. వాటిని ప్రార్థనాలయాలకు తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తారు. మరణించిన వారి ప్రతిరూపంగా వీటిని తాము భావిస్తామని ఐమారా ప్రజలు వెల్లడించారు. ఈ సామూహిక వేడుకల్లో పవిత్ర జలాలతో కపాలాలను శుభ్రపరుస్తారు. మతపరమైన పూజలు నిర్వహిస్తారు. తరతరాలుగా తాము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని ఇలా చేయడం వల్ల తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని