చిన శేషవాహనంపై మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం మలయప్పస్వామి  ఐదు తలల చిన శేషవాహనంపై..

Updated : 17 Oct 2020 10:56 IST

తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం మలయప్పస్వామి ఐదు తలల చిన శేషవాహనంపై విహరించారు. నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అవతారంలో భక్తులను అభయప్రదానం చేశారు. మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. ఈ రోజు రాత్రి హంసవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.  పెద్దశేష వాహనం ఆదిశేషుడైతే, చిన శేషవాహనం వాసుకిగా భావన. చిన శేషవాహనంపై కొలువైన స్వామిని పూజిస్తే కుండలిని యోగసిద్ది కలుగుతుందని భక్తుల విశ్వాసం. తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అర్చకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని