
Published : 18 Oct 2020 10:32 IST
సింహవాహనంపై శ్రీనివాసుడు
తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం మలయప్ప స్వామి సింహ వాహనంపై విహరించారు. ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చిన సింహ వాహనాన్ని పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో అలంకరించారు. యోగ నృసింహుడిగా సింహవాహనంపై స్వామి దర్శనమిచ్చారు. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడంతో మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆలయంలోనే చేశారు.
Tags :