Covid vaccination: టీకా విషయంలో అంతరం తగ్గించండి

కొవిడ్‌ టీకా విషయంలో పురుషులు, స్త్రీలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) తాజాగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖ శర్మ పేర్కొన్నారు. పెద్దఎత్తున మహిళలు టీకా కేంద్రాలకు తరలేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Updated : 23 Feb 2024 11:06 IST

దిల్లీ: కొవిడ్‌ టీకా విషయంలో పురుషులు, స్త్రీలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తాజాగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు. పెద్దఎత్తున మహిళలు టీకా కేంద్రాలకు తరలేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ అంతరాన్ని తగ్గించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ ఆవశ్యకతను వివరించడంతోపాటు అపోహలను తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆయా ప్రభుత్వాలకు సూచించారు. ‘నేటికీ చాలా ఇళ్లలో పురుషులతో పోల్చితే మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే.. వారి బాగోగులు చూసుకునేది మహిళలే. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం వారికే ఎక్కువగా ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు. వయసు మళ్లిన మహిళల్లో వ్యాక్సినేషన్‌ అంతరం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల తేలడంతో ఈ మేరకు ఆమె లేఖలు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని