Neelakurinji flowers: 12ఏళ్లకు ఒకసారి పూసే పూలను చూశారా?

కర్ణాటకలోని మందల్పట్టి  పుష్పగిరి, కొట్టే బెట్టా అనే కొండల్లో ఇవి దర్శనమిస్తాయి. లాక్‌డౌన్‌కి మినహయింపు ఇవ్వడంతో అరుదుగా పూసే ఈ పూలను చూసేందుకు వారం రోజుగా పర్యాటకులు వరుసగా క్యూ కడుతున్నారట. ఈఏడాది మొత్తంలో.. 

Updated : 27 Dec 2022 18:50 IST

బెంగళూరు: చూడటానికి కన్నులపండువగా ఉన్న ఈ పూలు భలే ఉన్నాయి కదూ! కనువిందు చూసే ఈ ఊదా రంగు పూలు 12ఏళ్లకొకసారి పూస్తాయి. వీటిని నీలకురింజి అంటారు. కర్ణాటకలోని మందల్పట్టి  పుష్పగిరి, కొట్టే బెట్టా కొండల్లో ఇవి దర్శనమిస్తాయి. అరుదుగా పూసే ఈ పూలను చూసేందుకు వారం రోజులుగా పర్యాటకులు వరుసగా క్యూ కడుతున్నారట. లాక్‌డౌన్‌కి మినహయింపు ఇవ్వడంతో వీరి సంఖ్య మరింత పెరిగింది.  ప్రస్తుతం ప్రాంతమంతా ఊదారంగు పూలతో పూర్తిగా నిండిపోయి, ఆహ్లాదాన్ని పంచుతోంది. ఈ సుమనోహర ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300-2400మీటర్ల ఎత్తులో ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 45 రకాల నీలకురింజీ పూలు ఉండగా.. అవన్నీ వేర్వేరు ఎత్తులో పెరుగుతుంటాయి. ఏరియల్‌ వ్యూలో ఈ ప్రదేశాన్ని, పూల అందాలను ఆస్వాదించేందుకు హెలి ట్యాక్సీ సర్వీసెస్‌ ప్రత్యేక రైడ్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,30,000 వెచ్చిస్తే ప్రదేశం మొత్తం హెలికాఫ్టర్‌లో చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని