NEET UG, CUET Exams 2023: నీట్‌ యూజీ, క్యూట్‌ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

దేశ వ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-యూజీ పరీక్ష, ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్‌కు సంబంధించి జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తేదీలను విడుదల చేసింది. 

Updated : 16 Dec 2022 03:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ-2023 (NEET UG 2023), ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్‌(CUET 2023) పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) క్యాలెండర్‌ విడుదల చేసింది. మే 7న దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా లక్షల మంది పోటీ పడే ఈ పరీక్ష కోసం విద్యార్థులు గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్‌-2023 (CUET 2023) తేదీలను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. మే 21 నుంచి 31 మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. క్యూట్‌ పరీక్షలకు సంబంధించి ఎన్‌టీఏ రిజర్వ్‌ తేదీలను కూడా ప్రకటించింది. అవి జూన్‌ 1 నుంచి జూన్‌ 7 వరకు ఉన్నాయి. 

ఇక దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2023 పరీక్ష తేదీలు సైతం విడుదలైన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో ఉండగా, రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. నేటి (డిసెంబర్‌ 15) నుంచి జనవరి 12 రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 12 రాత్రి 11.50 నిమిషాల వరకు గడువు విధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని