NEET Results 2022: నీట్‌ యూజీ 2022 ఫలితాలు విడుదల

దేశ వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ ఫలితాలు విడుదల అయ్యాయి. జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంకు రాగా, దిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంకు వచ్చింది.

Updated : 08 Sep 2022 00:30 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2022 ఫలితాలు విడుదల అయ్యాయి. జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంకు రాగా, దిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్‌ రావు ఐదో ర్యాంకుతో మెరిశాడు. యూపీ, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది అర్హత సాధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. జులై 17న దేశవ్యాప్తంగా 497 నగరాల్లో 3570 కేంద్రాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అత్యధికంగా 18.72 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

టాప్‌ 10 ర్యాంకులు సాధించింది వీరే..

1. తనిష్క (రాజస్థాన్‌)

2. వత్స ఆశీష్‌ బాత్రా (దిల్లీ)

3. హృషికేశ్‌ నాగ్‌భూషణ్‌ గంగూలే (కర్ణాటక)

4. రుచా పవాశి (కర్ణాటక)

5. ఎర్రబెల్లి సిద్ధార్థ్‌ రావు (తెలంగాణ)

6. రిషి వినయ్‌ బాల్సే (మహారాష్ట్ర)

7. అర్పిత నారంగ్‌ (పంజాబ్‌)

8. కృష్ణ ఎస్‌ఆర్‌ (కర్ణాటక)

9. జీల్‌ విపుల్‌ వ్యాస్‌ (గుజరాత్‌)

10. హాజిక్‌ పర్వీజ్‌ లోన్‌ (జమ్మూకశ్మీర్‌)

పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని