AVC: మీదుస్తుల నుంచి వైరస్‌ పోవాలంటే..

ఐరోపా, భారత్‌ ల్యాబ్స్‌లో ఈ లిక్విడ్‌ పనితీరు పరీక్షించారు

Updated : 15 Jun 2021 06:51 IST

యాంటీ వైరల్‌ కోటింగ్‌తో వారాల పాటు రక్షణ

దిల్లీ: శరీరం లోపలికి వెళ్లిన వైరస్‌ను అంతమొందించేందుకు మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి మన దుస్తులపై ఉన్న వైరస్‌ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం.. ఈ మాటకు సమాధానంగా.. లోక్‌ కవచ్‌ హెల్త్‌కేర్‌ ఒక లిక్విడ్‌ను తయారు చేసింది. యాంటీ వైరల్‌ కోటింగ్‌ (ఏవీసీ) టెక్నాలజీతో రూపొందిన ఇది హానికరమైన కరోనా వైరస్‌తో పాటు సూక్ష్మక్రిముల నుంచీ రక్షణ లభిస్తుంది. మార్కెట్లోకి ఈ ఉత్పత్తిని తూరియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనే కన్సెల్టెంట్‌ కంపెనీ తీసుకురానుంది. ఐరోపా, భారత్‌ ల్యాబ్స్‌లో ఈ ద్రావణం పనితీరును పరీక్షించారు. ఇందులో ఉన్న యాంటీ మైక్రోబయిల్‌ సొల్యుషన్‌ కారణంగా.. కేవలం బట్టలు ఉతికేందుకే కాకుండా నేలమీద శుభ్రపరిచేందుకు వినియోగించవచ్చు. ఈ సందర్భంగా తురియా ఇన్వేస్ట్‌మేంట్స్‌ సీఈఓ లూకే తల్వార్‌ మాట్లాడుతూ.. ‘‘ ఎన్నో అధ్యయనాల అనంతరం తగిన పరిణామాలతో యూండీ వైరల్‌ కోటింగ్‌ టెక్నాలజీతో ఇది రూపొందింది. మనుషులు వాడేందుకు ఎంతో సురక్షితం. దీని మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఉత్పత్తి సెకన్లలోనే 99.995 శాతం సామర్థ్యంతో పని చేస్తుంది. ఒక కప్‌ లిక్విడ్‌తో నేల మొత్తాన్ని శానిటటైజ్‌ చేయొచ్చు. తద్వారా వారాల పాటు క్రిముల నుంచి దూరంగా ఉండొచ్చు’’ అని తెలిపారు. కేవలం నేల మీదే కాకుండా చెక్క, టైల్స్‌, సిమెంట్‌, ప్లాస్టిక్‌ మీద ఉన్న వైరస్‌ నుంచీ మనకు రక్షణ కల్పిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని