Telangana High Court: తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌!

ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణతో పాటు

Updated : 17 May 2022 16:24 IST

దిల్లీ: ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గువాహటి రాష్ట్రాల హైకోర్టుకు కొత్త సీజేలను నియమించనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు.

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ విపిన్‌ సంఘీని ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అమ్జద్‌ ఎ.సయీద్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు సీజేగా, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రష్మిన్‌ ఎం.ఛాయాను గువాహటి హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.షిండేను రాజస్థాన్‌ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని