మనిషి చర్మంపై కరోనా ఎంతసేపు ఉంటుందంటే!

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించాలంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని జపాన్‌కు చెందిన క్యోటో వర్శిటీ పరిశోధులకు సూచించారు. ఎందుకంటే కరోనా వైరస్‌ గంటల తరబడి మనిషి చర్మంపై నిలిచి ఉంటుందని వారు పేర్కొన్నారు.

Updated : 19 Oct 2022 15:55 IST

టోక్యో: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించాలంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని జపాన్‌కు చెందిన క్యోటో వర్శిటీ పరిశోధకులు సూచించారు. ఎందుకంటే కరోనా వైరస్‌ గంటల తరబడి మనిషి చర్మంపై నిలిచి ఉంటుందని వారు పేర్కొన్నారు. వారి పరిశోధనలకు సంబంధించిన విషయాల్ని ఆక్స్‌ఫర్డ్‌ అంటువ్యాధుల విభాగానికి సంబంధించిన జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. 

పరిశోధనలో వెల్లడించిన ప్రకారం.. ‘కరోనా వైరస్‌ మనిషి శరీరంపై ఫ్లూ వైరస్‌ కన్నా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. దాదాపు 9గంటలకు పైగా చర్మంపై నిలిచి ఉండే అవకాశం ఉంది. దీంతో వైరస్‌ సులువుగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. దాన్ని నివారించడానికి చేతులను పరిశుభ్రంగా ఉంచడం ఎంతో ముఖ్యం. ఇథనాల్‌ ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా ఈ వైరస్‌లను 15 సెకన్లలో మనిషి శరీరం నుంచి నిర్మూలించవచ్చు’అని జర్నల్‌ ప్రచురించింది. మరోవైపు మాస్కు పెట్టుకోవడం ద్వారా శ్వాస, ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్య ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. 

యూఎస్‌కు చెందిన కేంద్ర వ్యాధుల నియంత్రణ విభాగం(సీడీసీ) పరిశోధనల ప్రకారం.. ‘కరోనా వైరస్‌ గాలిలో ఆరు అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకంగా వెంటిలేషన్‌ సరిగా లేని ప్రదేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది’ అని తెలిపింది. కానీ కొందరు నిపుణులు సీడీసీ సూచించిన మార్గదర్శకాలను తప్పుబట్టారు. వైరస్‌ బహిరంగ ప్రదేశాల్లో ఆరు అడుగుల దూరాన్ని పాటించినప్పటికీ వ్యాప్తి చెందుతుందని.. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి అని హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని