Andhra News: ప్రతి 2వేల జనాభాకు ఒక వైఎస్‌ఆర్ హెల్త్ క్లీనిక్: కృష్ణబాబు

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవదానానికి వారి కుటుంబసభ్యులను మానసికంగా సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు.

Published : 20 May 2022 20:20 IST

అమరావతి: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవదానానికి వారి కుటుంబసభ్యులను మానసికంగా సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు 8 మందికి అమర్చే అవకాశముందన్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో నిర్వహించిన జీవన్‌దాన్ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాన్స్ ప్లాంట్ కో-ఆర్డినేటర్లుగా శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు. అవయవదానంపై ట్రాన్స్ ప్లాంట్ కో-ఆర్డినేటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబసభ్యులకు ఓపిగ్గా కౌన్సెలింగ్ నిర్వహించి వారి కుటుంబసభ్యులను ఒప్పించాలని స్పష్టం చేశారు.

జీవన్ దాన్ కార్యక్రమం కింద హార్వెస్టెడ్‌ ఆర్గాన్స్ అన్నింటినీ ఏపీ ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణబాబు సూచించారు. రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కళాశాలలతోపాటు మరో 16 మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హెల్త్ హబ్‌లకు ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయిస్తోందన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రతీ 2వేల జనాభాకు ఒక వైఎస్‌ఆర్ హెల్త్ క్లీనిక్ అందుబుటో ఉండేలా రాష్ట్రంలో 10వేలకు పైగా వైఎస్‌ఆర్ హెల్త్ క్లీనిక్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వైద్యారోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉంటుందని కృష్ణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని