Traffic Rules: హైదరాబాద్‌లో అమల్లోకి ‘రోప్‌’.. స్టాప్‌లైన్‌ దాటితే..

నగరంలో నేటి నుంచి ట్రాఫిక్‌ ఫోలీసుల ఆపరేషన్‌ ‘రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌’ (రోప్‌) అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద రెడ్‌లైట్‌ వెలిగినప్పుడు పాదచారులు అటూ, ఇటూ దాటేందుకున్న తెల్లగీతల (స్టాప్‌లైన్‌)ను లెక్కచేయకుండా దూసుకెళ్లేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.

Updated : 03 Oct 2022 17:49 IST

హైదరాబాద్‌: నగరంలో నేటి నుంచి ట్రాఫిక్‌ ఫోలీసుల ఆపరేషన్‌ ‘రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌’ (రోప్‌) అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద రెడ్‌లైట్‌ వెలిగినప్పుడు పాదచారులు అటూ, ఇటూ దాటేందుకున్న తెల్లగీతల (స్టాప్‌లైన్‌)ను లెక్కచేయకుండా దూసుకెళ్లేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.

స్టాప్‌లైన్‌ను దాటేసి వెళ్తున్న వాహదారులకు ప్రస్తుతం రూ.100 జరిమానా విధిస్తుండగా.. ఈరోజు నుంచి రూ.200 జరిమానా వేయనున్నారు. ఎడమవైపు వెళ్లే (ఫ్రీ-లెఫ్ట్‌) వాహనదారులకు అడ్డుగా ఉన్న వారికి రూ.1000 జరిమానా విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణదారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే జరిమానా విధించడంతోపాటు కేసులు పెట్టనున్నారు.

పాదచారులకు ఆటంకం కలిగించేలా పార్కింగ్‌ చేస్తే రూ.600 జరిమానా విధించనున్నారు. ట్రాఫిక్‌ నియమాలు పక్కాగా అమలయ్యేలా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోప్‌ అమలు విధానాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని