Registrations: తెలంగాణలో నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు
తెలంగాణ వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. ఆర్టీఏ శాఖ సర్వర్ డౌన్ కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీఏ వెబ్ సైట్‌లో పాత, కొత్త వాహనాల వివరాలు కనిపించడంలేదని వాహనదారులు వాపోయారు. దీంతో ఇవాళ స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కాని వాహనదారులకు మరొకరోజు స్లాట్ కేటాయించనున్నట్లు రవాణాశాఖ అధికారులు తెలియజేశారు. దానికి సంబంధించిన పనులను సంబంధిత శాఖ చేపడుతుందని... వీలైనంత త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రేపటి నుంచి యథావిధిగా పనులు కొనసాగుతాయని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!