Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jun 2024 09:11 IST

1. గాడితప్పిన పోలీసు..

కేసుల విచారణలో.. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కానీ కొందరి తీరుతో ఆ కీర్తి క్రమంగా మసకబారుతోంది. పోలీసుశాఖ పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నా.. బదిలీల విషయంలో వృత్తి నైపుణ్యానికే ప్రాధాన్యమిస్తున్నా కొందరు అధికారుల ప్రవర్తన మారడంలేదు. అవినీతి, భూ, ఆస్తి తగాదాల కేసుల్లో చిక్కుకొని తమతోపాటు శాఖ పరువునూ అభాసుపాలు చేస్తున్నారు. తాజాగా ఎస్సై భవానీసేన్‌ అత్యాచార వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి కథనం 

2. ‘జగన్‌ది ధనదాహం.. ప్యాలెస్‌ల పిచ్చి’

మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ధనదాహం, ప్యాలెస్‌ల పిచ్చికి హద్దే లేకుండా పోయిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. అమరావతి నుంచి ఆదివారం స్థానిక విలేకర్లతో ఆమె చరవాణిలో మాట్లాడారు. అక్రమ కట్టడాలు ఉంటే కొట్టేయాలని వైకాపా హయాంలో పిలుపునిచ్చిన జగన్‌ రెడ్డి కోరికను న్యాయస్థానాలు తీరుస్తున్నాయన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ధనదాహం, ప్యాలెస్‌ల పిచ్చికి హద్దే లేకుండా పోయిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. పూర్తి కథనం 

3. ‘భూ’చోళ్ల పని పట్టాలి

వైకాపా పాలనలో మద్యం, ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్‌ భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కడప జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు.పూర్తి కథనం 

4. ‘నీట్‌’ లీకేజీలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం

నీట్‌ పేపర్‌ లీకేజీలో 14 మంది కేంద్ర మంత్రులకు ప్రమేయం ఉందని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. లీకేజీకి నిరసనగా ఆదివారం యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు రాష్ట్ర భాజపా కార్యాలయ ముట్టడికి బయలుదేరగా గాంధీభవన్‌ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారిని బయటికి రానివ్వకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టి గేట్లు మూసివేశారు.పూర్తి కథనం 

5. జడ్పీ ఛైర్మన్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి పొన్నం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ ప్రసంగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ నేతలు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ గ్రామంలో స్థానిక నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి కథనం 

6. రండి.. రండి.. అమరావతికి రండి

అసలు రాజధానే లేకుండా ఐదేళ్లూ పరిపాలన సాగించిన జగన్‌ చేసిన నష్టాలను పూడ్చుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక దిక్సూచిగా ఉపయోగపడే అమరావతిని తిరిగి పట్టాలెక్కించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు.పూర్తి కథనం 

7. ఆది నుంచి అక్రమాల పర్వం

అధికారం అండగా విశాఖలో వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమంగా చేపట్టిన భారీ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడుతోంది. సిరిపురం రహదారిలోని సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ నార్తర్న్‌ సర్కార్‌) స్థలంలో ‘ఎంవీవీ పీక్‌ వెంచర్‌’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు పనులకు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు ‘స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌’ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు చేపడుతున్న స్థల వ్యవహారం మొదలుకుని అనుమతుల వరకు ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి.పూర్తి కథనం 

8.  ఏపీలో అరాచక ఐపీఎస్‌ అధికారుల్లో భయం

వైకాపా హయాంలో కన్నూ మిన్నూ కానరాకుండా పేట్రేగిపోయిన కొందరు అరాచక ఐపీఎస్‌ అధికారులను ఇప్పుడు కేసుల భయం వెంటాడుతోంది. నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మితిమీరిన ‘జగన్‌ భక్తి’ ప్రదర్శించి చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన ఆ అధికారులు.. గత ఐదేళ్లలో తాము చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా చుట్టుముడతాయనే ఆందోళనతో గడుపుతున్నారు.పూర్తి కథనం 

9. 550/100.. వామ్మో.. అంత తాగారా..!

డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురు మందుబాబుల ఫలితాలు చూసి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా రక్తంలో మద్యం మోతాదు(బీఏసీ) శాతం 550ఎంజీ/100ఎంఎల్‌గా వచ్చింది. సాధారణంగా 300 దాటితేనే ఎక్కువగా భావిస్తారు. శనివారం రాత్రి ఈ నలుగురికి ఏకంగా 550/100 రావడం చూసి ఆశ్చర్యపోయారు. పూర్తి కథనం 

10. ఈ వారం ఐపీఓల సందడే సందడి

ఈ వారం ప్రాథమిక మార్కెట్‌లో సందడి నెలకొంది. ప్రధాన కంపెనీలతో పాటు ఎస్‌ఎంఈ విభాగంలో 10 సంస్థలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.1991 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి. మరో 11 కంపెనీలు, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అరంగేట్రం చేయనున్నాయిపూర్తి కథనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని