నిజనిర్థారణ కమిటీ వేయాలి: తెలంగాణ

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది.

Published : 16 Feb 2021 12:08 IST


దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. పనులు ఆపేయాలని ఎన్టీటీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టొద్దని పునరుద్ఘాటించింది. పనులు జరుపుతున్నారన్న పిటిషనర్‌ అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఈ వ్యవహారంపై నిజనిర్థారణ కమిటీ వేయాలని తెలంగాణ తరఫు న్యాయవాది కోరారు. నిజనిర్థారణ కమిటీ వేయాలన్న తెలంగాణ వినతిపై కూడా వివరణ ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని