Rushikonda: విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే

విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు

Updated : 11 May 2022 13:33 IST

విశాఖ: విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 6న ఎన్జీటీ బెంచ్‌ విచారణ జరిపింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని ఎన్జీటీ నియమించింది. ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది.

రుషికొండ వద్ద ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ గతేడాదే స్పందించింది. అక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకూ ఆదేశించింది. రుషికొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, బృహత్తర ప్రణాళికను మీరారని, పర్యావరణానికి హానికలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని