AP News: కరోనా ఎఫెక్ట్‌.. ఏపీలో నైట్‌ కర్ఫ్యూ

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.

Updated : 10 Jan 2022 14:35 IST

అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. రాత్రి కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను  రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేయనుంది.

‘‘ప్రజలంతా మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలి. కొవిడ్‌ నివారణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలి. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలి. వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలి. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి.. ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదు’’ అని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని