Amalapuram: అమలాపురం అల్లర్లు.. మరో 19 మంది అరెస్టు: డీఐజీ పాలరాజు

కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఆందోళన వ్యవహారంలో ఇప్పటికే 46

Published : 26 May 2022 21:57 IST

ఏలూరు: కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఆందోళన వ్యవహారంలో ఇప్పటికే 46 మందిని అరెస్టు చసినట్లు పోలీసులు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి తాజాగా మరో 19 మందిని అరెస్టు చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు వెల్లడించారు. వారిపై 307, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మరికొంత మంది అనుమానితులను గుర్తించామని.. రేపు వారినీ అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపేసిన ఇంటర్నెట్ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తున్నట్లు డీఐజీ వెల్లడించారు. అంతేకాకుండా అల్లర్లకు సంబంధించి పోలీసు శాఖలో తలెత్తిన అంతర్గత లోపాలను సమీక్షించుకుంటున్నట్లు డీఐజీ పాలరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని