Nirai Mata Mandir: ఆ గుడి తలుపులు ఏడాదిలో 5 గంటలే తెరుచుకుంటాయ్!
భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. దేవుడు వెలిసిన విధానంతో కావొచ్చు.. ఆలయ అద్భుత నిర్మాణంతో కావొచ్చు.. పుణ్యక్షేత్రాలుగా వేటికవి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కొన్ని ఆలయాల్లోకి ఏడాదిపొడవునా భక్తులకు అనుమతిస్తే.. శబరిమల, ఛార్‌ధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు
(Photo: youngisthan.in)
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. దేవుడు వెలిసిన విధానంతో కావొచ్చు.. ఆలయ అద్భుత నిర్మాణంతో కావొచ్చు.. పుణ్యక్షేత్రాలుగా వేటి ప్రత్యేకత వాటిదే. కొన్ని ఆలయాల్లోకి ఏడాది పొడవునా భక్తులకు అనుమతిస్తే.. శబరిమల, ఛార్‌ధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు ఏడాదిలో నెల, రెండు నెలల చొప్పున భగవంతుడి దర్శనం భాగ్యం కల్పిస్తారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ దేవాలయంలో మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే గుడి తలుపులు తెరుచుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదా! మరి ఆ ఆలయం సంగతులేంటో తెలుసుకుందామా..!
మనం చెప్పుకుంటున్నది.. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న నీరయ్ మాతా దేవాలయం గురించి. ఈ ఆలయంలోని నీరయ్ మాతా కేవలం ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భక్తులకు దర్శనం ఇస్తుంది. అందుకే, ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. అయితే, ఇక్కడ పూజా విధానమంతా వేరుగా ఉంటుంది. సాధారణంగా దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఉపయోగించరు. కేవలం కొబ్బరికాయ కొట్టి.. అగరబత్తులు వెలిగిస్తే చాలు మాతకు పూజలు చేసినట్లే. ఆ ఐదు గంటలు దాటిన తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించరు. తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది. అంతేకాదు.. ఈ దేవాలయంలో పంచిన ప్రసాదాన్ని మహిళలు తినకూడదట. తింటే చెడు జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం.
దీపం దానికదే వెలుగుతుందట!
చైత్ర నవరాత్రుల ప్రారంభంలో నీరయ్ మాతా ఆలయంలోని దీపం దానంతట అదే వెలుగుతుందట. నూనె లేకున్నా.. తొమ్మిది రోజులపాటు దీపం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. దీని వెనుకన్న రహస్యాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు ఎమ్మెల్యే అయ్యాడు
-
Tanzania: టాంజానియాలో విరిగిపడ్డ కొండచరియలు.. 47 మంది మృతి
-
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్
-
Germany: మ్యూనిచ్ ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం.. మంచులో చిక్కుకుపోయిన విమానాలు..!
-
Nayanthara: స్టూడెంట్స్‌కు బిర్యానీ వడ్డించిన నయనతార.. వీడియో చూశారా!
-
భార్యాభర్తలు, మామా అల్లుళ్ల గెలుపు.. ఆ పార్టీ ఎంపీలంతా ఓటమి!