Rythu Bandhu: పదెకరాలకు పైగా ఉన్నవారికి మొత్తంగా ఇస్తోంది ₹250 కోట్లే: నిరంజన్‌రెడ్డి

రైతుబంధు పథకం కింద 9వ విడతలో లబ్ధిదారులకు రూ.7,508 కోట్లు ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. పదెకరాలకు పైగా ఉన్న...

Updated : 29 Jun 2022 16:14 IST

హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద 9వ విడతలో లబ్ధిదారులకు రూ.7,508 కోట్లు ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. పదెకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు మొత్తంగా అందిస్తోంది కేవలం రూ.250 కోట్లు మాత్రమేనని చెప్పారు. హైదరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ రెండు రోజుల్లో ఎకరా, రెండెకరాలు ఉన్నటువంటి 36.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,820.75 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదెకరాలు, అంతకన్నా తక్కువ ఉన్నవారే అత్యధికంగా 92.50 శాతం మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. విడతల వారీగా లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తామని నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని