పుదుచ్చేరికి 600 కి.మీ దూరంలో ‘నివర్‌’

ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Published : 23 Nov 2020 11:35 IST

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా బలపడనుంది. పుదుచ్చేరిలోని కరైంకల్‌ -మామళ్లపురం మధ్య ఈనెల 25న తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

 ఈ తుపానుకు నివర్‌ అనే పేరు పెట్టనున్నారు. ఇరాన్‌ దేశం ఈ పేరును సూచించింది. ఇప్పటికే వాగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలోస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే..తమిళనాడు, తెలంగాణలోనూ అదే స్థాయి వానలు పడతాయని  వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కొన్నిచోట్ల సాధారణ వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. చేపల వేటకు వెళ్ల వద్దని ఆదివారం నుంచే మత్స్యకారులకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తంగా ఈ తుపాను ప్రభావం 26వ తేదీ వరకూ ఉండనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని