Himalayan: గ్లేసియర్స్‌ కరగవు.. గంగానది ఎండిపోదు..!

హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయా.. ఇలానే కొనసాగితే జాతీయ నదిగా ఉన్న గంగా నది ఎండిపోక తప్పదా.. కొన్ని రోజుల్లో మానవులు ప్రకృతి విపత్తును ఎదుర్కోవాల్సిందేనా.. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం కావాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Published : 05 May 2022 01:40 IST

దిల్లీ: హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయా.. ఇలానే కొనసాగితే జీవనది గంగా నది ఎండిపోక తప్పదా.. కొన్ని రోజుల్లో మానవులు ప్రకృతి విపత్తును ఎదుర్కోవాల్సిందేనా.. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం కావాలంటే ఈ కథనం చదవాల్సిందే..హిమనీనదాలు కరిగిపోతున్నాయని, అలా కరిగి అవి అదృశ్యమైతే భారతదేశంలోని నదులు ఎండిపోతాయనే వాదనలు అవాస్తవమని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గంగా, బ్రహ్మపుత్ర,సింధు నదుల జలాలకు, హిమాలయలు కరగిపోవడం ఎటువంటి సంబంధంలేదని తేటతెల్లమైంది. అన్ని నదుల ప్రవాహాలు హిమనీనదాలు కరగడం వల్ల, వర్షం కారణంగానే ఏర్పడ్డాయి. ఇవి హిమనీనదాలు అదృశ్యమయ్యాక కూడా కొనసాగుతూనే ఉంటాయని కాటో ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది.

ఇస్రో ఏంచెప్పిందంటే :
11,700 సంవత్సరాల క్రితం నుంచి హిమాలయాల్లో మంచుకరగడం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో  ఇది కరగడం పెరగడం లేదని ఇటీవల అధ్యయనాలు, ఉపగ్రహ డేటాను ఉటంకిస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పేర్కొంది. 2001-2011 మధ్య చేసిన పరిశోధనల్లో ఆశ్చర్యమైన విషయాలు తెలిశాయి. 2,018 హిమనీనదాలపై అధ్యయనం చేయగా వాటిలో 1,752 స్థిరంగా ఉన్నాయి.248 హిమనీనదాలు కొంచెం కరిగిపోయాయి. తాజా అధ్యయనాల ప్రకారం ‘హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగానది ఎండిపోతుందనే వాదనలు విని కొందరు ఆందోళన చెందుతున్నారు. హిమాలయాల్లో ఉన్న గంగోత్రి పర్వతం ఇటీవలి కాలంలో 10మీటర్లు(33అడుగులు) వరకు క్షీణించింది. ఇది ఇలాగే కొనసాగినా మరో 3,000 సంవత్సరాల వరకు గంగానదికి ఎటువంటి ముప్పురాదు. 2035నాటికి హిమాలయ హిమనీనదాలు అన్ని కరిగిపోవచ్చని ఇటీవల కొందరు పేర్కొన్న విషయంలో వాస్తవం లేదు’.అని పేర్కొన్నారు.

గంగా ప్రవాహం 94శాతం వర్షప్రభావమే:
 వాస్తవానికి హిమనీనదాలు కరగడం నదుల ప్రవాహంలో కేవలం ఒక్కశాతం మాత్రమే ప్రభావం చూపుతుంది. గంగానది ప్రవాహం 94శాతం వర్షప్రభావమే. ఈ రెండింటికీ మధ్య తేడాను గుర్తించాలి. శీతాకాలంలో ఎక్కువగా పెరిగిన మంచు కరుగుతుంది కానీ హిమలయాలు కరగడం లేదు. కాబట్టి, హిమనీనదాల సంకోచం వల్ల నదులు ఎండిపోతాయని, కరవు, నీటి ఎద్ధడులు తలెత్తుతాయనే వాదనలు సరికావని అధ్యయనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని