AP News: సాధారణ బదిలీల్లో మినహాయింపుపై ఆ లేఖలు పరిగణనలోకి తీసుకోవద్దు: జీఏడీ

సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసే ఆఫీస్‌ బేరర్ల లేఖలు నిలుపుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 07 Jun 2023 20:18 IST

అమరావతి: సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసే ఆఫీస్‌ బేరర్ల లేఖల నిలుపుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, సర్వీసెస్‌ అసోసియేషన్ల లేఖలను పరిగణనలోకి తీసుకోవద్దని సూచనలిచ్చింది. సిఫార్సు లేఖల్లో నకిలీవి ఉంటున్నాయని తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర, జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లోనూ నకిలీ లేఖలు వస్తున్నాయని తెలిపింది. ఆఫీస్‌ బేరర్ల సిఫార్సు లేఖలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు కోసం ఆఫీస్‌ బేరర్లుగా లేఖలు ఇచ్చిన ఉద్యోగుల వివరాలు తెలియజేయాలని జీఏడీ ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని