AndhraPradesh : ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదు: సీపీ కాంతిరాణా

పీఆర్సీకి వ్యతిరేకంగా గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి

Updated : 02 Feb 2022 05:08 IST

అమరావతి: పీఆర్సీకి వ్యతిరేకంగా గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా తెలిపారు. కొవిడ్ దృష్ట్యా ఉద్యోగ సంఘాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉందని పేర్కొన్నారు. ఐదు వేలమంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారని చెప్పారు. అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించారు. దయ చేసి విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావొద్దని సీపీ కాంతిరాణా సూచించారు. 

మరోవైపు ఉద్యోగులు ఆందోళనలను విరమించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ విజ్ఞప్తి చేశారు. ఇవాళ రాత్రి 11 లోగా కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు వేస్తామని చెప్పారు. అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ‘చలో విజయవాడ’, సమ్మె కార్యాచరణ విరమించుకోవాలని సూచించారు. సమ్మెకు వెళ్లడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలకు మరోసారి సిద్ధమని తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగుల సమ్మెను అసాంఘిక శక్తులు కైవసం చేసుకునే అవకాశం ఉందని వివరించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. అయితే మంత్రుల కమిటీతో జరుగుతున్న చర్చలు విఫమైనట్లేనని పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్, సూర్యనారాయణ అన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని