TS News: సంక్రాంతికి బోసిపోయిన భాగ్యనగరం

పండుగ వచ్చిందంటే పట్టణం పల్లెబాట పడుతుంది. పల్లెలు జనాలతో కళకళలాడుతుంటే  నగరం మాత్రం బోసిపోతోంది. సక్రాంతి సందర్భంగా నగరంలోని వ్యాపార సముదాయాలు, ప్రధాన రహదారులు... 

Published : 16 Jan 2022 03:31 IST

హైదరాబాద్‌: పండుగ వచ్చిందంటే పట్టణం పల్లెబాట పడుతుంది. పల్లెలు జనాలతో కళకళలాడుతుంటే  నగరం మాత్రం బోసిపోతోంది. సక్రాంతి సందర్భంగా నగరంలోని వ్యాపార సముదాయాలు, ప్రధాన రహదారులు, కూడళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 24గంటలూ రద్దీగా ఉండే హైదరాబాద్‌ రోడ్లన్నీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా బోసిపోతున్నాయి. ఎప్పుడూ ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బంది పడే నగరవాసులు ఇవాళ ట్రాఫిక్‌ సమస్యలు లేకపోవడంతో రయ్‌.. రయ్‌ మంటూ దూసుకుపోతున్నారు. నగరంలోని నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్‌, రాజ్‌భవన్‌రోడ్‌, నెక్లెస్‌ రోడ్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, మాదాపూర్‌, శిల్పారామం, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని