Telangana News: మంత్రి పువ్వాడ అజయ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో నోటీసు

మంత్రి పువ్వాడ అజయ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కి వాయిదా వేసింది.

Published : 27 Jan 2023 18:20 IST

హైదరాబాద్‌: మంత్రి పువ్వాడ అజయ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసు జారీ చేసింది. మమత మెడికల్‌ కాలేజీ ఛైర్మన్‌ హోదాలో ఆయనకు కోర్టు నోటీసు ఇచ్చింది. పీజీ వైద్య కోర్సులకు 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలకు గతేడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, మమత మెడికల్‌ కాలేజీ పీజీ వైద్య కోర్సులకు 2017జీవో ప్రకారం పెంచిన ఫీజులు వసూలు చేసింది.  దీంతో కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  ఈక్రమంలో మమత మెడికల్‌కాలేజీ తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్‌కి నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని