Vaccination: సెకన్లలోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌.. ఎలాగంటే..?

వాట్సాప్‌ ద్వారా కొవిడ్‌ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని

Updated : 09 Aug 2021 01:20 IST

దిల్లీ: వాట్సాప్‌ ద్వారా కొవిడ్‌ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. దానికి సంబంధించిన విషయాలను ఆదివారం ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కొవిడ్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌కు MyGov కరోనా హెల్ప్‌డెస్క్ నంబర్‌ +91 9013151515ను ముందుగా సేవ్‌ చేసుకోవాలి. ఈ నంబరుకు 'కొవిడ్ సర్టిఫికేట్' అని ఇంగ్లీష్‌లో టైప్ చేసి వాట్సాప్‌ చేయాలి. తర్వాత మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేస్తే సర్టిఫికేట్‌ కొన్ని సెకన్లలోనే డౌన్‌లోడ్‌ అవుతుంది’ అని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని