ఇకపై ఇన్‌స్టా రీల్స్‌లోనూ ‘యాడ్స్‌’

వినోదాన్నే కాదు.. ఎంతోమందికి ఉపాధిగానూ మారింది ఇన్‌స్టాగ్రామ్‌. తమ ప్రతిభను నలుగురికి చూపై వేదికయింది. రాత్రికి రాత్రి సెలబ్రెటీని చేసే సత్తా ఉన్న మాధ్యమాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

Updated : 19 Jun 2021 17:06 IST

ఇన్‌స్టా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జస్టిన్‌ ఓసోఫ్స్కీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోదాన్నే కాదు.. ఎంతోమందికి ఉపాధిగానూ మారింది ఇన్‌స్టాగ్రామ్‌. తమ ప్రతిభను నలుగురికి చూపై వేదికయింది. రాత్రికి రాత్రి సెలబ్రెటీని చేసే సత్తా ఉన్న మాధ్యమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇంతటి ఆదరణ పొందిన ఈ ఇన్‌స్టాలో రీల్స్‌ ఇప్పటి యూత్‌ ఫేవరెట్‌. నిమిషాల నిడివి ఉన్న వీడియోలు రూపొందించి అప్‌లోడ్‌ చేస్తుంటారు ఇందులో. అయితే ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌లోనూ యాడ్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ఇన్‌స్టా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జస్టిన్‌ ఓసోఫ్స్కీ పేర్కొన్నారు.

‘‘యాడ్స్‌కి రీల్స్‌లానే 30 సెకన్ల నిడివి కేటాయించాం. ఇతరులకు షేర్‌ చేసే అవకాశం ఉంటుంది. నచ్చితే కామెంట్‌, లైక్‌ కూడా కొట్టొచ్చు’’ అని ఆయన తెలిపారు. కాగా ఈ యాడ్స్‌ ద్వారా వ్యాపారాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరువ అవ్వాలనే ఉద్దేశంతో పాటు కొత్త కొత్త బ్రాండ్లు, క్రియేటర్ల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడేలా రూపొందించామని ఇన్‌స్టా బ్లాగ్‌లో పేర్కొంది.  ఒకవేళ రీల్స్‌లో మీకు యాడ్‌ నచ్చితే ఇన్‌స్టా స్టోరీలోనూ పెట్టుకోవచ్చు. నచ్చకపోతే వెంటనే స్కిప్‌ లేదా హైడ్‌ చేసేలా ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఏదైనా యాడ్‌ అసభ్యకరంగా అనిపిస్తే.. రిపోర్టు చేసే వెసులుబాటు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు