Sunburn: ‘సన్‌బర్న్‌’ షోను అడ్డుకునేందుకు యత్నించిన ఎన్‌ఎస్‌యూఐ

శంషాబాద్‌ విమానాశ్రయం జీఎమ్మార్‌ ఎరీనాలో శుక్రవారం రాత్రి భారీ బందోబస్తు మధ్య ‘సన్‌బర్న్‌’ సంగీత వేడుకలు ప్రారంభమయ్యాయి. వీటిని అడ్డుకునేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ప్రయత్నించారు. 

Updated : 23 Sep 2022 23:53 IST

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం జీఎమ్మార్‌ ఎరీనాలో శుక్రవారం రాత్రి భారీ బందోబస్తు మధ్య ‘సన్‌బర్న్‌’ సంగీత వేడుకలు ప్రారంభమయ్యాయి. ‘సన్‌బర్న్‌’ షోను అడ్డుకుంటామని మొదటి నుంచి ఎన్‌ఎస్‌యూఐ నాయకులు హెచ్చరించారు. దీంతో శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నోవాటెల్ వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసులు బ్లాక్ చేశారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అక్కడి భారీగా చేరుకున్నారు. అనంతరం ఈ షోలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కొంత మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ‘సన్‌బర్న్‌’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డంకులు తొలగిపోవడంతో ‘సన్‌బర్న్‌’ షో వేడుకల నిర్వహకులు, పోలీసులు, ఔత్సాహికులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఈ వేడుకల్లో పాల్గొనడానికి మైనర్లు భారీగా తరలివచ్చినట్లు సమాచారం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని