JEE Main 2023: జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. త్వరలోనే అడ్మిట్‌ కార్డుల(Admit cards)ను అందుబాటులో ఉంచనున్నట్టు ఎన్‌టీఏ(NTA) ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Published : 19 Jan 2023 17:30 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌(JEE Main 2023) తొలి విడత పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్టు జాతీయ పరీక్షల మండలి (NTA) వెల్లడించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో పరీక్షను జనవరి 24, 25, 27, 28 ,29, 30, 31వరకు నిర్వహించనున్నట్టు తెలపగా.. తాజాగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. బీఈ, బీటెక్‌ విభాగాల్లో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష (పేపర్‌ 1, రెండు షిఫ్టుల్లో)  జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, జనవరి 28న బీఆర్క్‌, బీ ప్లానింగ్‌  విభాగంలో పేపర్‌-2ఏ, 2బీ పరీక్ష (మధ్యాహ్నం షిఫ్ట్‌‌లో) జరుగుతుందని పేర్కొంది. 

దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టీఏ స్పష్టంచేసింది. పరీక్ష జరిగే నగరాల సమాచారానికి సంబంధించిన స్లిప్‌ను అభ్యర్థులు చెక్‌ చేసుకోవాలని కోరింది. అడ్మిట్‌ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. తదుపరి వివరాల కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌https://jeemain.nta.nic.in/ను చెక్‌ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు