NTR: ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్‌లోకి

ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 వెండి నాణెం ముద్రణపై కేంద్రం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 21 Mar 2023 19:35 IST

హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 వెండి నాణెం ముద్రణపై కేంద్రం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో నాణెం తయారీ ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 నాణెం త్వరలో మార్కెట్‌లోకి రానుందని అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని