
NTR Trust : కొవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ టెలిమెడిసిన్ సేవలు
హైదరాబాద్: కొవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం చేపట్టింది. మిస్డ్‌కాల్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ టెలిమెడిసిన్ సేవలను అందించేందుకు నిర్ణయించింది. టెలిమెడిసిన్ కోరేవారు 88010 33323కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని సూచించింది. బాధితుల ఫోన్‌కు టెలిమెడిసిన్ సేవలందించే జూమ్ లింక్ వెళ్తుందని వెల్లడించింది. జూమ్ లింక్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు పొందొచ్చని పేర్కొంది. అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉచితంగా మందుల పంపిణీ చేస్తామని వివరించింది. కొవిడ్ బాధితులకు ప్రతి రోజూ ఉదయం 7.30 గంటలకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.