HYD: ప్రగతిభవన్‌ ముట్టడికి నర్సుల యత్నం

తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌ ముట్టడికి నర్సులు యత్నించారు. కరోనా సమయంలో తమని విధుల్లోకి తీసుకుని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆవేదన వ్యక్తం

Updated : 07 Jul 2021 14:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌ ముట్టడికి నర్సులు యత్నించారు. కరోనా సమయంలో తమని విధుల్లోకి తీసుకుని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర పాటు కొవిడ్‌ సేవలు చేయించుకుని.. వైరస్‌ తీవ్రత తగ్గగానే బయటకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,640 మంది నర్సులను తొలగించారని వాపోయారు. కష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేశామని తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న నర్సులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని