Navodaya Vidyalaya Samiti: నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాబోయే విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 29న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

Published : 03 Jan 2023 01:21 IST

దిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం(2023-24)లో ఆరో తరగతి ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి(Navodaya Vidyalaya Samiti) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో https://navodaya.gov.in/nvs/en/Home1/ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం సోమవారం నుంచి జనవరి 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఏప్రిల్‌ 29న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఎంపిక పరీక్షకు సంబంధించిన ఫలితాలను జూన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరిని తెలిపింది. దీంతో పాటు అభ్యర్థి ఫోటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ అవసరం ఉంటుంది. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. అలాగే, అడ్మిషన్‌ పొందాలనుకుంటున్న జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌/గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలని   నవోదయ విద్యాలయ సమితి తెలిపింది. దీంతో పాటు అభ్యర్థి మే 1, 2011 నుంచి ఏప్రిల్ 30, 2013 మధ్య జన్మించి ఉండాలని నిబంధన విధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని