Hyd Metro Rail: ఫేజ్‌-2లో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు: ఎన్వీఎస్‌ రెడ్డి

మెట్రో ఫేజ్‌-2 నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ఎండీ ఎన్వీఎన్‌ రెడ్డి తెలిపారు.

Updated : 21 Apr 2022 17:22 IST

హైదరాబాద్‌: మెట్రో ఫేజ్‌-2 నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ఎండీ ఎన్వీఎన్‌ రెడ్డి తెలిపారు. ఫేజ్‌-2 కింద శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి రూ.5వేల కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మెట్రో స్టేషన్‌ నుంచి గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ ఆటోలను పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద ఎన్వీఎస్‌ రెడ్డి ప్రారంభించారు. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ‘మెట్రో రైడ్‌’ పేరుతో ఎలక్ట్రిక్‌ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రైవేట్‌ వాహనాలతో పోలిస్తే ఈ ఆటోల్లో ఛార్జీలు తక్కువగా ఉంటాయని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో ఫేజ్‌-2లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. కరోనాతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇప్పటి వరకు మెట్రోకు రూ.3వేల కోట్ల నష్టం వచ్చిందని.. నష్టాలు వచ్చినా హైదరాబాద్‌ మెట్రోను ఎల్‌ అండ్‌ టీ మధ్యలో వదిలేయకుండా నిర్వహిస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు