ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ వేలం లేదు!

కరోనా మహమ్మారి వినాయక ఉత్సవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వైరస్‌ కారణంగా ప్రఖ్యాత బాలాపూర్‌ లడ్డూ వేలం నిర్వహించబోమని ఉత్సవ కమిటీ వెల్లడించింది.

Updated : 23 Jul 2020 14:58 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వినాయక ఉత్సవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వైరస్‌ కారణంగా ప్రఖ్యాత బాలాపూర్‌ లడ్డూ వేలం నిర్వహించబోమని ఉత్సవ కమిటీ వెల్లడించింది.అంతేకాకుండా ఈ ఏడాది కేవలం 6 అడుగుల విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ఉత్సవ నిర్వహణపై ఇవాళ  బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం సమితి ఆధ్వర్యంలో మాత్రమే తొలిపూజ నిర్వహించనున్నారు. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తుల పూజలు, దర్శనాలు రద్దు చేశారు. గణేశ్‌ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.గతేడాది వేలంలో బాలాపూర్‌ లడ్డూ రూ.17.60 లక్షలు పలికింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని