సార్‌! నా 63 కోళ్లు డీజే మ్యూజిక్‌ వల్లే చనిపోయాయి..

‘ నిజం సార్‌! నా 63 బ్రాయిలర్‌ కోళ్లు చనిపోవడానికి కారణం.. ఆ పెళ్లిలో పెట్టిన డీజే సౌండ్స్‌ వల్లే! చెవులకు చిల్లులు పడే ఆ శబ్దాలకు అవి తట్టుకోలేకపోయాయి.. పాపం చివరికి అవి చనిపోయాయి’’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడో కోళ్ల ఫాం వ్యాపారి. 

Published : 25 Nov 2021 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ నిజం సార్‌! నా 63 బ్రాయిలర్‌ కోళ్లు చనిపోవడానికి కారణం.. ఆ పెళ్లిలో పెట్టిన డీజే సౌండ్స్‌ వల్లే! చెవులకు చిల్లులు పడే ఆ శబ్దాలకు అవి తట్టుకోలేకపోయాయి.. పాపం చివరికి అవి చనిపోయాయి’’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడో కోళ్ల  వ్యాపారి. ఈ సంఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగింది. రంజిత్‌ పరిదా అనే కోళ్లవ్యాపారి కోళ్ల ఫాం నిర్వహిస్తున్నాడు.  ఆదివారం రాత్రి 11గంటలకు స్థానికంగా జరిగిన ఓ వివాహ వేడుకల్లో డీజేతో ఊరేగింపు ఏర్పాటు చేశారు. దానికి తోడు భారీగా శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చారట. అక్కడే ఉన్న రంజిత్‌ కోళ్ల ఫాంలో రెండువేల బ్రాయిలర్‌ కోళ్లు ఆ శబ్దాల తాకిడికి తట్టుకోలేక విలవిలలాడిపోయాయి. అది గమనించిన తాను.. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కాస్త సౌండ్‌ తగ్గించమని అడిగినా.. మద్యం మత్తులో ఉన్న అక్కడవారంతా నన్ను తిట్టడం మొదలు పెట్టారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారీసౌండ్స్‌తో  63 కోళ్లు మృత్యువాతపడ్డాయి.  పెళ్లి వారి నుంచి నష్టపరిహారం చెల్లించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. నష్టపరిహారం చెల్లించేందుకు పెళ్లి బృందం నిరాకరించింది. ఇదే విషయంపై వెటర్నరీ డాక్టర్లు మాట్లాడుతూ... తీవ్రమైన శబ్దాలు, బాణాసంచా కారణంగా గుండెపోటుతో మూగజీవాలు చనిపోయినట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని