Oil Reusage: అదే నూనెను మళ్లీ వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి!

వంటల్లో ఎక్కువ నూనెను వాడటమే ఆరోగ్యానికి మంచిది కాదంటూ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటిది వాడిన నూనెను మళ్లీ వాడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి. 

Updated : 16 Oct 2022 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల సీజన్ మొదలైంది కదా.. షాపింగ్‌లు, ఇంటి అలంకరణలు ఇలా బోలెడు పనులు ఉంటాయి. ముఖ్యంగా పండగంటే రకరకాల పిండి వంటలు, స్వీట్లు చేయాల్సి ఉంటుంది. రోజూ వంట చేస్తే దానికి సరిపడా నూనెను వాడుతారు. కానీ పిండి వంటలు చేసేందుకు ఎక్కువ మోతాదులో నూనె అవసరం ఉంటుంది. పిండి వంటలన్నీ సిద్ధమయ్యాయి సరే! మిగిలిపోయిన నూనెను ఏం చేయాలి? ఇది ప్రతి ఇల్లాలికి ఎదురయ్యే సమస్య. చాలామంది తిరిగి వంటల్లో వాడుతుంటారు. దీని వల్ల లాభమా? నష్టమా? తెలుసుకోండి! 

  • ఒకసారి వంటల్లో ఉపయోగించిన నూనెను తిరిగి వంటల్లో వాడితే ఆరోగ్యానికి హాని చేసుకున్నట్లే! గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.
  • చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. నూనెను ఒకసారి ఉపయోగించితే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే ఆ నూనె చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది.
  • ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించడం ద్వారా ఆహారం విషతుల్యం అవుతుందనే చెప్పాలి. దీంతో కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి.
  • నూనెను పదే పదే వేడి చేసి అదే వాడటం ద్వారా క్యాన్సర్‌ వచ్చేందుకు దారితీయవచ్చు.
  • ఇంట్లో పిండి వంటలు చేసినప్పుడు, డీప్‌ఫ్రైలు చేసిన నూనెను తిరిగి ఉపయోగించకండి.
  • బయట చేసే చిరుతిండ్లను ఎక్కువగా తినకండి. పూర్తిగా మానేయటం మంచిది. అంతగా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకోండి. 
  • బజ్జీలు, పకోడీలు చేసేందుకు అదే నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. అవి తింటే అనారోగ్యంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని