జూబ్లీహిల్స్‌ బ్యాంక్‌ సిబ్బంది నిర్వాకం.. 18 గంటలపాటు లాకర్‌ గదిలో 84 ఏళ్ల వృద్ధుడు!

బ్యాంక్‌ సిబ్బంది నిర్వాకం ఓ వృద్ధుడిని 18 గంటలపాటు బ్యాంక్‌ లాకర్‌ గదిలో ఉండేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ యూనియన్‌ బ్యాంక్‌లో

Updated : 29 Mar 2022 12:57 IST

జూబ్లీహిల్స్‌: బ్యాంక్‌ సిబ్బంది నిర్వాకం ఓ వృద్ధుడిని 18 గంటలపాటు బ్యాంక్‌ లాకర్‌ గదిలో ఉండేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ యూనియన్‌ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 67లో 84 ఏళ్ల వ్యాపారి కృష్ణారెడ్డి నివాసముంటున్నారు. ఆయన సోమవారం సాయంత్రం 4.20గంటలకు బ్యాంక్‌ లాకర్‌ పని మీద జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లోని యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్లారు. లాకర్‌ గది లోపల కృష్ణారెడ్డి ఉండగానే సిబ్బంది గమనించకుండా దాన్ని మూసివేయడంతో ఆయన రాత్రంతా అందులోనే గడపాల్సి వచ్చింది. 

ఎప్పటికీ కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించగా బ్యాంక్‌ లాకర్‌ గదిలో కృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వృద్ధుడికి మధుమేహం ఉండంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని