AP News: ఆ బామ్మ వయసు పదహారట.. అందుకే పింఛను నిలిపేశారట..!

ఆధార్ కార్డులో దొర్లిన చిన్న తప్పు ఓ వృద్ధురాలి పింఛను పోయేలా చేసింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గాంధీ చౌక్ వీధిలో నివసిస్తున్న షేక్ అమీనాబీ గత 20 ఏళ్లుగా పింఛను పొందుతున్నారు.

Published : 12 Sep 2021 14:21 IST

ఉరవకొండ: ఆధార్ కార్డులో దొర్లిన చిన్న తప్పు ఓ వృద్ధురాలి పింఛను పోయేలా చేసింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గాంధీ చౌక్ వీధిలో నివసిస్తున్న షేక్ అమీనాబీ గత 20 ఏళ్లుగా పింఛను పొందుతున్నారు. జులై నుంచి పింఛను నిలిపేయటంతో కంగారు పడిన ఆమె.. కారణాలు తెలుసుకునేందుకు అధికారుల చుట్టూ తిరిగారు. ఆధార్ కార్డులో ఆమె వయసు 16 ఏళ్లని ఉండటంతో పింఛను నిలిచిపోయిందని అధికారులు చెప్పిన సమాధానంతో ఆమె కంగుతిన్నారు. మూడేళ్లకు మించి వయసులో మార్పులు చేయాల్సి ఉంటే ప్రధాన కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని.. అప్‌డేట్ పూర్తయిన వెంటనే పింఛను ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని