
NASA: జిల్.. జిల్.. అంతరిక్షం నుంచి టోక్యో ఒలింపిక్స్ జిగేల్
రాత్రిపూట టోక్యో వెలుగుల చిత్రాన్ని తీసిన ఐఎస్ఎస్
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు ఇంటర్నెట్లో అంతా టోక్యో ఒలింపిక్స్ సందడే దర్శనమిస్తోంది. ఓ పక్క పోటీల్లో మెడల్స్ గెలుచుకున్న విజేతల సంబరాలు.. మరో పక్క అక్కడ నిర్వహించే ఆటలపోటీల వివరాలు.. ఇలా వీటి అప్డేట్స్లో ఇంటర్నెట్ నిండిపోతోంది. తాజాగా ఆ జాబితాలోకి ఎన్నడూ చూడని ఓ చిత్రం కనువిందు చేస్తోంది. రాత్రిపూట టోక్యో వెలుగుల చిత్రమే అది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఈ చిత్రాన్ని తీయగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ పోస్ట్ పెట్టిన 12 గంటల్లో 5.3 లక్షల లైక్స్, వరుస కామెంట్లతో వైరల్గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.