Telangana Formation Day: తెలంగాణ.. సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు పొందింది..!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day)  సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. 

Updated : 02 Jun 2023 10:12 IST

దిల్లీ: దేశంలో 29వ రాష్ట్రం తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. శుక్రవారం పదో ఏడాదిలో అడుగుపెట్టింది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన విజయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. (Telangana Formation Day) 

‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గొప్ప  సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులైన వ్యక్తులను కలిగి ఉంది. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. ఆ రాష్ట్రం ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది. తెలంగాణ అభివృద్ధి, శ్రేయస్సు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను’అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) అభినందనలు తెలియజేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని