Tirupati: గోవిందరాజస్వామి ఆలయంలో అపశ్రుతి.. రావిచెట్టు కూలి వ్యక్తి మృతి

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అపశ్రుతి చోటు చేసుకుంది.

Published : 01 Jun 2023 19:06 IST

తిరుపతి: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయం ధ్వజస్తంభం వద్ద ఉన్న వందల ఏళ్లనాటి పెద్ద రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్‌ గుర్రప్ప(70)గా  గుర్తించారు. గుర్రప్ప గతంలో స్విమ్స్‌లో వైద్యుడిగా సేవలందించారని, ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. తిరుపతి స్విమ్స్‌లో మెడిసిన్‌ చదువుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చిన గుర్రప్ప.. గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని