Published : 29 Jun 2022 20:40 IST

Cyberabad: ప్రముఖుల రాక .. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ రాక సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ చుట్టు పక్కల 5కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని సహా కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రానున్న దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఈనెల 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సీపీ వివరించారు. మరో వైపు జులై 1 నుంచి 4వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts