Hyderabad: హైదరాబాద్‌లో ‘వన్‌ వీక్‌.. వన్‌ ల్యాబ్‌’..ప్రారంభించిన కేంద్ర మంత్రి

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌, ఐఐటీసీ ఆడిటోరియంలో ‘వన్‌ వీక్‌ వన్‌ ల్యాబ్‌’ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ప్రారంభించారు.

Updated : 07 Mar 2023 19:25 IST

హైదరాబాద్‌: వెదురు పరిశ్రమను సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి జితేందర్‌ సింగ్‌ అన్నారు. గతంలో వెదురు కోసం చైనా, కొరియా, జపాన్‌ మీద ఆధారపడేవాళ్లమని.. ఆయా దేశాలు పన్ను పెంచడంతో వెదురు పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆ వెదురను ఉపయోగించే అగరవత్తులు తయారు చేస్తున్నామని తెలిపారు. తార్నాక సీఎస్‌ఐఆర్‌, ఐఐసీటీ ఆడిటోరియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 12 వరకు నిర్వహించనున్న ‘వన్‌ వీక్‌ వన్‌ ల్యాబ్‌’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికత వల్లే వెదురుపరిశ్రమ వృద్ధి చెందిందన్నారు. భారత్‌ అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్న ఆయన.. మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం భారత్‌ బయోటెక్‌ కో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. సమాజ అవసరాల కోసం శాస్త్రవేత్తలు రిస్క్‌ తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ప్రాజెక్టులే కాకుండా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేయాలన్నారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరముందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని